వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్‌-స్పామ్ మెసేజ్‌లకు చెక్ పెట్టవచ్చు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (15:12 IST)
ప్రముఖ మేసెజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. చాట్ మొత్తాన్ని కాకుండా కొన్ని నిర్దిష్ట మెసేజ్‌లను మాత్రమే రిపోర్ట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో వ్యక్తిగత, బిజినెస్ చాట్స్‌ను మాత్రమే రిపోర్ట్ చేసే అవకాశముంది. తాజాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో టెస్టింగ్ చేస్తోన్న ఈ బీటా వెర్షన్ ఫీచర్ ద్వారా దుర్వినియోగ (Abusive), స్పామ్ మెసేజ్‌లకు చెక్ పెట్టవచ్చని వాట్సాప్ భావిస్తోంది.
 
ఇప్పుడు యూజర్లు రిపోర్ట్ చేసిన మెసేజ్‌లు మాత్రమే యాప్‌కు ఫార్వర్డ్ అవుతాయని, సెండర్‌కు వీటి గురించి వాట్సాప్ నోటిఫై చేస్తుందని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo స్పష్టం చేసింది. ఈ రిపోర్టింగ్ ప్రక్రియ ప్రస్తుత విధానానికి విభిన్నంగా ఉంటుందని తెలిపింది. కంప్లీట్ చాట్ వివరాలకు అనుగుణంగా వినియోగదారుని బిజినెస్ రిపోర్ట్స్ లో రీసెంట్ గా ఉన్న ఐదు మెసేజెస్‌ను వాట్సాప్‌కు ఫార్వర్డ్ చేస్తుంది. బీటా వెర్షన్‌లో మెసెజ్‌పై గట్టిగా నొక్కితే(హోల్డ్ చేసినప్పుడు) వినియోగదారులకు 'రిపోర్ట్' ఆప్షన్ కనిపిస్తుంది.
 
ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో వ్యక్తిగత మెసేజ్ రిపోర్టును కూడా డబ్ల్యూఏబీటాఇన్ఫో కనుగొంది. పెద్ద సంఖ్యలో బీటా టెస్టర్ల కోసం ఆండ్రాయిడ్ లో ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.21.20.1 లో కనిపిస్తుంది. వినియోగదారులు మెసేజ్ పై ఎక్కువ సేపు నొక్కి ఉంచితే రైట్ కార్నర్‌లో (మూడు చూక్కలు ఉన్నచోట) రిపోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోవడం ద్వారా సింగిల్ మెసేజ్‌ను రిపోర్ట్ చేయవచ్చు. 
 
సాధారణ వినియోగదారులకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం ఇది అందుబాటులోకి వస్తుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments