Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్.. ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడాలో..?

Advertiesment
WhatsApp
, శనివారం, 28 ఆగస్టు 2021 (17:31 IST)
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్లను అందిస్తుంది. తాజాగా వాట్సాప్ మీ విచక్షణతో మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూస్తారు అనే సరికొత్త ఫీచర్ అందిస్తోంది. ఇది మీ ప్రొఫైల్ ఫోటో గోప్యతను కాపాడుతుంది.
 
చాలా మంది వ్యక్తులు మీ ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆ విషయం మీకు కూడా తెలియదు. గోప్యత పరంగా ఇది సరైనది కాదు. ఆ సందర్భంలో, మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడొచ్చు అనేది ఇకపై మీరే నిర్ణయించవచ్చు. 
 
దీనిద్వారా మీరు కావాలనుకునే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మొదలైన వారు మాత్రమే మీ ప్రొఫైల్ ఫోటోను చూడగలరు. మరోవైపు సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు వాట్సాప్ తన యూజర్స్‌కు కీలక సూచనలు చేసింది. 
 
ఇందులో భాగంగా వాట్సాప్ యూజర్స్ వాట్సాప్ మోడ్ యాప్స్‌ను ఉపయోగించొద్దని సూచించింది. మోడ్‌ యాప్స్‌ లేదా మోడిఫైడ్ యాప్స్‌లో సాధారణ యాప్స్‌లో ఉండే ఫీచర్స్‌ కంటే కొన్ని రకాల ఫీచర్స్ అదనంగా ఉంటాయి. 
 
అయితే ఇవి ఆమోదయోగ్యమైనవి కాదని వాట్సాప్ చెబుతోంది. సాధారణ యాప్స్ కంటే మోడ్ యాప్స్ ఎక్కువ ఫీచర్స్‌ని అందిస్తున్నప్పటికీ, వీటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా హ్యాకర్స్‌ యూజర్‌ ఫోన్లలోని సమాచారాన్ని సులువుగా దొంగిలిస్తున్నారని తెలిపింది. 
 
వాట్సాప్‌లో ఉన్న విధంగా మోడ్ యాప్స్‌లో సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉండవని పేర్కొంది. అందుకే యూజర్స్ వాట్సాప్ మోడ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచిస్తోంది.
 
వాట్సాప్ మోడ్‌ యాప్స్‌లో ఎఫ్‌ఎండబ్ల్యూ వాట్సాప్‌ 16.80.0లో టార్జాన్ ట్రియాడా వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని వాట్సాప్‌ తెలిపింది. ఈ వెర్షన్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే ఇందులోని వైరస్‌ ఫోన్‌లోని మొత్తం సమాచారాన్ని హ్యాకర్స్‌కి చేరవేస్తోందని కాస్పర్‌స్కై అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. 
 
అంతేకాకుండా ఫోన్‌లలో స్క్రీన్‌ మొత్తం కనిపించేలా ప్రకటనలు ఇవ్వడం, సబ్‌స్క్రిప్షన్ ఖాతాల్లోకి యూజర్ ప్రమేయం లేకుండా లాగిన్ కావడం, బ్యాంక్‌ ఖాతాల్లోకి ప్రవేశించడం వంటివి తాము గుర్తించినట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. అందుకే యూజర్స్ మోడ్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవద్దని వాట్సాప్ సూచిస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారం రోజుల్లో అవన్నీ అప్పగించారో సరే, లేదంటేనా?: ఆఫ్ఘన్ ప్రజలకు తాలిబన్లు వార్నింగ్