Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌పై హ్యాకర్స్ బ్రెజిల్ కన్ను.. వాట్సాప్‌ క్రాష్‌తో..?

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:05 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్‌ యూజర్స్‌కి మరింత చేరువవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్‌కు చెందిన హ్యాకర్స్‌ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్‌ బాంబ్‌గా పిలిచే స్కేరీ మెస్సేజెస్‌ వైరస్‌తో వాట్సాప్‌ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. 
 
ఆగస్టు మధ్యలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించినట్లు తెలిపింది. కొద్ది రోజుల కిత్రం వాట్సాప్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యాప్‌లలో ఎలాంటి కొత్త ఫీచర్స్‌ ఉండాలని కోరుకుంటున్నారో తెలియజేయమంటూ వాబీటా ఇన్ఫో యూజర్లను కోరింది.  
 
ఎలాంటి అర్థం లేని కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్‌ను వరుస క్రమంలో ఉంచి ఒక సందేశం లేదా ఏదైనా ఆర్ట్‌ రూపంలో సృష్టించి ఫార్వార్డ్‌ మెస్సేజ్‌లా పంపుతారు. దానిని రిసీవ్ చేసుకున్న వారు తెరవగానే వాట్సాప్‌ క్రాష్ అవుతుంది. 
 
కొన్నిసార్లు వాట్సాప్‌ను క్లోజ్‌ చేసి, తిరిగి ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తే ఫోన్‌ క్రాష్ అయ్యే అవకాశమూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సమస్యకు ఎలాంటి తాత్కాలిక పరిష్కారం లేదని వాబీటాఇన్ఫో తెలిపింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments