Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం: మంత్రి ఆదిమూల‌పు సురేష్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (20:21 IST)
సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మంగళవారం నాడు మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ నెల 10 నుంచి వివిధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని.. ఎంసెట్‌లో సుమారు 2,72,720 మంది నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ ఎంసెట్ పరీక్షను 118 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. ఎగ్జామ్ ముందు, తర్వాత కూడా హాల్‌ను శానిటైజ్ చేస్తాం. ప్రతి సెంటర్‌లో ఇసోలేషన్ రూమ్‌లు అందుబాటులో ఉంచాం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్ సంయుక్తంగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.

విద్యార్థులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాం. హాల్ టికెట్‌తో పాటు పరీక్ష సెంటర్ రోడ్డు మ్యాప్ కూడా అందిస్తున్నాం’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా ముఖంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments