సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో ప్రస్తుతం కొత్త కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌లో ఏదైనా ఫోటో అనుకోకుండా డిలిట్ అయితే ఇక బాధపడనక్కర్లేదు. వాట్సప్‌లో డిలిట్ చేసిన ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర ఫైల్స్‌ని రీస్టోర్ చేయొచ్చు. గత 30 రోజుల్లో వచ్చిన ఫోటో, వీడియో, ఫైల్.. ఈ మూడింటిలో ఏదైనా రీస్టోర్ చేసుకోవచ్చు.
ఎలాగంటే...? మీకు ఫైల్ పంపిన వారి ఛాట్ ఓపెన్ చేసి ఆ ఫైల్ వెతికి సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. అయితే ఈ అవకాశం మీకు ఫైల్ వచ్చిన 30 రోజుల వరకు మాత్రమే. అప్పటివరకు ఆ ఫైల్ వాట్సప్ సర్వర్‌లోనే ఉంటుంది.
30 రోజులు దాటిందంటే వాట్సప్ సర్వర్ నుంచి కూడా ఫైల్ డిలిట్ అవుతుంది. కాబట్టి మీరు 30 రోజుల్లోనే ఆ ఛాట్ నుంచి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఛాట్ డిలిట్ చేయకుండా ఉంటేనే ఇది సాధ్యం. మీరు ఒకవేళ ఛాట్ డిలిట్ చేసినట్టైతే అందులోని ఏ ఫైల్ కూడా తిరిగి డౌన్‌లోడ్ చేయలేరు.
ఇలా వాట్సప్‌లో యూజర్లకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఫీచర్స్ తీసుకొచ్చేందుకు వాట్సప్ ఎప్పుడూ కసరత్తు చేస్తూనే ఉంటుంది. త్వరలో స్టిక్కర్స్‌ని సెర్చ్ చేసే ఫీచర్‌ని తీసుకురాబోతోంది వాట్సప్.