Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..అందుబాటులోకి రియాక్షన్స్ ఫీచర్‌

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (10:35 IST)
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. రియాక్షన్స్ ఫీచర్‌ను వాట్సాఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్‌ను ఇవాళ్టి నుంచే అందించబోతున్నట్టు మెటా ప్లాట్‌ఫామ్స్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రకటించారు. 
 
వాట్సప్‌లో మొదట ఎమోజీతో రియాక్షన్స్ ఫీచర్‌ను టెస్ట్ చేశారు. ఈ ఫీచర్‌లో ఆరు రకాల రియాక్షన్స్ అందుబాటులో ఉంటాయి. లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్, సాడ్, థ్యాంక్స్ ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. వాట్సప్‌లో ఏదైనా మెసేజ్‌కి మీ రియాక్షన్‌ని వీటి ద్వారా తెలపడానికి వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది.  
 
ఇప్పటికే ఈ ఫీచర్ ఇతర యాప్స్‌లో ఉంది. వాట్సప్ యూజర్ల కోసం ఈ ఫీచర్ రిలీజ్ చేయడం విశేషం.  
 
మరోవైపు వాట్సప్ మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తోంది. ఫైల్ షేరింగ్ లిమిట్‌ను 2జీబీ వరకు పెంచబోతోంది. గ్రూప్ ఆడియో కాల్స్ లిమిట్‌ను కూడా 32 మందికి పెంచబోతోంది. వాట్సప్ కాల్స్‌లో ఒకేసారి 32 మందితో కాన్ఫరెన్స్ నిర్వహించవచ్చు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments