Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ సర్వర్ క్రాష్... సేవలకు అంతరాయం

సామాజిక ప్రసార మాద్యమాల్లో ఒకటైన వాట్సాప్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. దీనికి కారణం సర్వర్ క్రాష్ కావడమే. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:03 IST)
సామాజిక ప్రసార మాద్యమాల్లో ఒకటైన వాట్సాప్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. దీనికి కారణం సర్వర్ క్రాష్ కావడమే. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, భారత్‌లో మాత్రం వాట్సాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. 
 
భారత కాలమానం ప్రకారం నవంబర్ 30వ తేదీ గురువారం రాత్రి 11 తర్వాత అంటే అర్థరాత్రి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో సర్వర్‌ క్రాష్ కావడంతో వీటి సర్వీసులకు బ్రేక్ పడింది. అర్థరాత్రి కావటం అందరూ నిద్రలో ఉండటంతో భారత్‌లో పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ, ఇంగ్లండ్, యూరప్ దేశాలు, దక్షిణ అమెరికాల్లో మాత్రం వాట్సాప్ బ్రేక్‌డౌన్ కావటం కలకలం రేపింది. పెద్ద ఎత్తున కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. 
 
దీనిపై వాట్సాప్ ప్రతినిధులు స్పందిస్తూ, సర్వర్ క్రాష్ అయిన మాట వాస్తవమే అన్నారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేశామని.. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సాధారణంగానే పని చేస్తుందని వారు ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు. కాగా, గత రెండు నెలల్లో వాట్సాప్ సర్వీస్ బ్రేక్ డౌన్ కావటం ఇది మూడోసారి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments