వాట్సాప్ న్యూ ఫీచర్: చాటింగ్ చేస్తూ యూట్యూబ్ చూడొచ్చు

సామాజిక ప్రసారమాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా చాటింగ్ చేస్తూ యూట్యూబ్ చూడొచ్చు. అంటే మెసేజ్‌లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌ను వీ

బుధవారం, 29 నవంబరు 2017 (10:02 IST)
సామాజిక ప్రసారమాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా చాటింగ్ చేస్తూ యూట్యూబ్ చూడొచ్చు. అంటే మెసేజ్‌లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌ను వీడాల్సిన అవసరంలేదు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది.
 
చాట్‌లో భాగంగా ఏదైనా యూట్యూబ్‌ వీడియో లింక్‌ను పంపిస్తే.. ఇకపై ఆ వీడియోను వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. ఆ వీడియోను చూస్తూ చాట్‌ చేసుకోవచ్చు. ఇతర చాట్‌లోకి కూడా వెళ్లవచ్చు. 
 
గతంలో ఎవరైనా పంపిన యూట్యూబ్‌ వీడియో లింక్‌ను క్లిక్‌ చేస్తే అది యూట్యూబ్‌ యాప్‌లోకి వెళ్లి ప్లే అయ్యేది. దీంతో వాట్సాప్‌ నుంచి యూజర్‌ యూట్యూబ్‌కు వెళ్లాల్సివచ్చేది. ఇపుడు అలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా చాటింగ్ మధ్యలోనే వీడియోను చూసుకునే సదుపాయం లభించనుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మెట్రో కిటకిట.. ఫస్ట్‌జర్నీ కోసం పోటీపడుతున్న జనాలు