కమల్ హాసన్ అభిమానిపై చేజేసుకున్నాడా? (వీడియో)
						
		
						
				
సినీ లెజెండ్ కమల్ హాసనకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాలుమీద పడేందుకు వస్తున్న తన అభిమానిని కమల్ హాసన్ వద్దంటూ తోసేసినట్లు కలదు. అయితే అభిమానిపై కమల్ హాసన్ చ
			
		          
	  
	
		
										
								
																	సినీ లెజెండ్ కమల్ హాసనకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాలుమీద పడేందుకు వస్తున్న తన అభిమానిని కమల్ హాసన్ వద్దంటూ తోసేసినట్లు కలదు. అయితే అభిమానిపై కమల్ హాసన్ చేజేసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేసి.. సూపర్ స్టార్ రజనీ కాంత్ తన ఫ్యాన్స్ కాలుపై పడినా కామ్‌గా వుండిపోగా, కమల్ హాసన్ కాలు మీద పద్ధతిని వద్దంటున్నారని పోలిక చూపుతూ మీమ్స్ పేలుతున్నాయి. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఇప్పటికే రజనీ ఫ్యాన్స్- కమల్ ఫ్యాన్స్ వీడియోలు పోస్టులతో పోల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తమ విలన్ సినిమా సందర్భంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కమల్ హాసన్ తన అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించారని ప్రచారం సాగుతోంది. కానీ కమల్ మీదకు వస్తున్న అభిమానిని పోలీసు వెనక్కి నెట్టారని కమల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి.