#ChildrensDay : పిల్లలు.. దేవుడు.. చల్లనివారే..

'నేటి బాలలే రేపటి పౌరులు' అన్నారు మన పెద్దలు. బాలలు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రతిభవంతులైన పౌరులు సమాజాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారు.

మంగళవారం, 14 నవంబరు 2017 (08:28 IST)
'నేటి బాలలే రేపటి పౌరులు' అన్నారు మన పెద్దలు. బాలలు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రతిభవంతులైన పౌరులు సమాజాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారు. అందుకే బాలలుగా ఉన్నప్పుడే వారిని సన్మార్గంలో నడిపించాలి. పసి హృదయాల్లో ఎలాంటి కల్మషం ఉండదు. అందుకే చిన్నారులను అందరూ ఇష్టపడతారు. ఈ కారణంగానే చిన్నారులంటే దేశ తొలి మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు ఎనలేని ప్రేమ. నెహ్రూ అన్న కూడా బాలలకు ఎంతో ఇష్టం. అందుకే బాలలపై నెహ్రూకు ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పుట్టినరోజునే దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
 
నెహ్రుకు కూడా పసిపిల్లలంటే అమితమైన ఇష్టం. ప్రాణం. అందుకే ఆయన చిన్నారులను గులాబీలతో పోల్చారు. చిన్నారులపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఎప్పుడు ఎదపై గులాబీ ధరించేవారు. నెహ్రూ ఆశయాలను, ఆదర్శాలను స్మరించుకుంటూ ఆయన పుట్టిన రోజునే దేశ వ్యాప్తంగా చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ముఖ్యంగా, పిల్లలతో నెహ్రూకున్న అనుబంధం ప్రత్యేకమైనది. చిన్నారులను పువ్వుల్లాగా సున్నితంగా చూడాలని చెప్పేవారు. విలువలతో కూడిన సమాజం నిర్మాణానానికి మూలం పిల్లలేనని నమ్మేవారు. అందుకే ఎక్కువగా పిల్లలతో గడిపేందుకు ఆయన ఇష్టపడ్డారు. బాలలతో సరదగా గడుపుతూ వారికి జీవితా పాఠాలు నేర్పేవారయన. పిల్లలపై నెహ్రూ చూపిన ప్రేమ ఆయనకు చాచా అనే బిరుదును తెచ్చిపెట్టింది.
 
బాలల దినోత్సవాన్ని స్కూళ్ళలో సెల్ఫ్ గవర్నింగ్ డే‌గా జరుపుకొంటారు చిన్నారులు. అన్నీ తామై ఈ ఒక్క రోజు స్కూల్ నడిపించి ఎంజాయ్ చేస్తారు. క్విజ్, కల్చరల్ ప్రోగ్రామ్స్, దేశ భక్తి గీతాలు, డాన్స్‌లతో సందడిచేస్తారు. అందుకే నవంబర్ 14 అంటే చిన్నారులకు పండగే. సో పిల్లలందరికి చిల్డ్రన్స్ డే విషెష్ చెబుతోంది వెబ్‌దునియా తెలుగు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈ కాయ సర్వరోగ నివారణి...