వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ వచ్చేసింది.. అందుబాటులోకి డార్క్ మోడ్ ఆప్షన్

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (19:18 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ వచ్చింది. ఇకపై వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్‌ చాట్ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్‌లోకి మారుతుంది. ఫలితంగా కంటికి ఎలాంటి ఇబ్బంది వుండదని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక యూజర్లు సెట్టింగ్స్‌లోని చాట్స్‌, థీమ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి డార్క్‌ అనే ఫీచర్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. 
 
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లందరికీ ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇంకా వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో వాట్సప్‌లో అడ్వాన్స్ సెర్చ్, బ్యాకప్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, ఆటో డౌన్‌లోడ్ రూల్స్ ఫీచర్స్ రానున్నాయి. 
 
వాట్సప్‌లో ఫార్వర్డ్ మెసేజెస్ కుప్పలుతెప్పలుగా వస్తుంటాయి. వీటిలో అవసరం లేని ఫోటోలు, వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ ఆటో డౌన్‌లోడ్ కాకుండా డిసేబుల్ చేసే ఆప్షన్ త్వరలో వాట్సప్‌లో రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments