ఎంతసేపూ సెల్ఫ్ వీడియోలేనా? వాళ్ళ గురించి ఆలోచన చేయండి..

శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:26 IST)
లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన అనేక మంది సెలెబ్రిటీలు ఇంట్లో పనులు చేస్తూ వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ సెలెబ్రిటీల వీడియోలతో నిండిపోయింది. 
 
కానీ, లాక్‌డౌన్ కారణంగా కోట్లాది మంది ఒక పూట తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి మరింత దుర్భంగా ఉంది. ఇలాంటి వారంతా తమ సొంతూళ్ళకు వెళ్లలేక జాతీయ రహదారుల వెంబడి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన గుడారాల్లో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. అధికారులు ఎపుడో తెచ్చిపెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సెలెబ్రిటీల సెల్ఫ్ వీడియలపై ప్రముఖ టెన్నిస్ స్టార్ సన్నీ లియోన్ స్పందించారు. 'ఇప్పటికీ మనం వంటల వీడియోలు, ఆహారానికి సంబంధించి ఫొటోలతోనే సరిపెడుతున్నామా? అవతల వేలమంది ప్రజలు మృత్యుకోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. కొందరు ఆకలితో ఆలమటిస్తూ ఒక్కపూట తిండి దొరికినా అదృష్టవంతులమే అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఆలోచించండి' అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా లాక్‌డౌన్... ఆస్ట్రేలియా క్రికెటర్ల పెళ్లిళ్లు వాయిదా