Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ.. సామాజిక దూరం అంటే... దేశ పౌరులారా చూసి నేర్చుకోండి... నెటిజన్స్

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (19:17 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ వైరస్ వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు సామాజిక భౌతిక దూరాన్ని పాటించాలని నిపుణులు సూచన చేస్తున్నారు. 
 
వ్య‌క్తికి వ్య‌క్తికీ మ‌ధ్య సామాజిక దూరం (సోష‌ల్ డిస్టేన్స్) పాటిస్తే క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చ‌ని డాక్ల‌రు, నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది పౌరులు వీరి సూచనలు బేఖాతర్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని జంతువులు, పక్షులు మాత్రం ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే అవి సామాజికి దూరాన్ని పాటిస్తున్నాయి. ఇటీవల రోడ్డును దాటుకునే సమయంలో ఏనుగులు దూరం దూరంగా నడుస్తూ వెళ్లాయి. 
 
ఇపుడు కొన్ని నెమళ్లు కూడా ఇదే విధంగా నడుచుకున్నాయి. సామాజిక దూరం పాటించ‌డం అంటే ఇట్లా... అంటూ చెప్తున్న‌ట్లుగా ఉన్న ఓ ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని నగౌర్ ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల వ‌రండాలో నెమ‌ళ్లు ఒక‌దానికొక‌టి దూరం పాటిస్తూ... క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌డుకున్న ఫొటోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ షేర్ చేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెమళ్లకు ఉన్న జ్ఞానం, తెలివి మన పౌరులకు లేదని, వీటిని చూసైనా ప్రజలు తెలుసుకోవాలంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments