Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 896 పాజిటివ్ కరోనా కేసులు.. 206 మంది మృతి

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (19:04 IST)
భారత్‌‌లో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నా గత 24 గంటల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 896 పాజిటివ్ కేసులు నమోదైనాయి. భారత్‌లో 24 గంటల్లో 37 మంది కరోనా బారిన పడి మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
భారత్‌లో తాజా కేసులతో కలిపి మొత్తం ఇప్పటివరకూ 6,761 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో 6039 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో కరోనా సోకి ఇప్పటిదాకా 206 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటివరకు 20,473 మంది విదేశీయులను వారి స్వదేశాలకు తరలించామని విదేశాంగశాఖ ప్రకటించింది. వివిధ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరవై వేలకు పైగా విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించామని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments