Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌కు కేంద్రం వార్నింగ్.. భారత్‌లో ప్రత్యేక కార్యాలయం వుండాలి

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌కు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అంతేగాకుండా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కి కేంద్రం పలు సూచనలు చేసింది. వాట్సాప్ ద్వారా ఏమైనా సమస్యులు ఉత్పన్నమైతే అమెరికా నుంచి స

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (11:28 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌కు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. అంతేగాకుండా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కి కేంద్రం పలు సూచనలు చేసింది. వాట్సాప్ ద్వారా ఏమైనా సమస్యులు ఉత్పన్నమైతే అమెరికా నుంచి సమాధానాలు రావడం ఏమిటని.. వాట్సాప్‌ను భారత్‌లోని అత్యధిక ప్రజలు వినియోగిస్తున్నందున భారత్‌‍లో ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. 
 
అలాగే వాట్సాప్ ద్వారా అసత్య వార్తలు, అశ్లీల దృశ్యాలు వ్యాప్తి చెందకుండా చూడాలని రవి శంకర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో వాట్సాప్ సేవలు విస్తృతమవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అయితే, వాట్సాప్ ద్వారా మంచితో పాటు చెడు కూడా జరుగుతోందని మంత్రి వివరించారు. 
 
వాట్సాప్‌ను నియత్రించడానికి భారత్‌లో ప్రత్యేకంగా ఓ అధికారి ఉండాలని, భారత చట్టాల గురించి అవగాహన తెచ్చుకుని వాటికి లోబడి వాట్సాప్‌ను నియంత్రించాలని సూచించారు. వాట్సాప్‌లో తొలుత ఫేక్ న్యూస్‌ను ఎవరు పుట్టిస్తున్నారో కచ్చితంగా తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తామని డేనియల్స్ హామీ ఇచ్చారు. ఫేక్ న్యూస్ ప్రసారం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments