Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్, ఆపిల్ స్టోర్‌ల నుంచి మాయమైన 'టిక్ టాక్'

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:03 IST)
చైనాకు చెందిన ‘టిక్‌టాక్‌’ యాప్‌పై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు నిషేధం విధించగా, ఆ నిషేధం అలాగే కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్ యాప్‌ స్టోర్ల నుంచి టిక్ టాక్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భారత్‌లో ఆ రెండు అప్లికేషన్ స్టోర్ల నుంచి ఈ యాప్‌ను తొలగించారు. 


స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న ఫీచర్లను ఉపయోగించుకుని యూజర్లు ఈ యాప్‌ ద్వారా చిన్నపాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసేవారు. అయితే కొందరు ఈ వీడియోలను దుర్వినియోగం చేస్తూ కొందరిపై లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అభ్యంతరాలు తెలియజేసారు.
 
టిక్ టాక్ అప్లికేషన్ యువతను పెడదారి పట్టిస్తోందని, దీని వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలుపుతూ వెంటనే నిషేధం విధించాలని మధురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం దీన్ని నిషేధిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, మద్రాస్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆ యాప్‌ ప్రతినిధులు సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేశారు. తాజాగా వారి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం గూగుల్‌, ఆపిల్ సంస్థలకు లేఖలు రాయడంతో ఈ యాప్‌లను వాటి ప్లే స్టోర్‌ల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ‘టిక్‌టాక్‌’ యాప్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం