Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో ఆర్థిక అస్థిరత - లింక్డిన్ నుంచి 716 మందికి ఉద్వాసన

Webdunia
మంగళవారం, 9 మే 2023 (15:53 IST)
ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్థిక ఆస్థిరత నెలకొంది. దీంతో పలు టెక్ కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన టెక్ కంపెనీ లింక్డిన్ కూడా ఉద్యోగుల్లో కోత విధించింది. ఏకంగా 716 మందికి ఉద్వాసన పలికింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సామాజిక మాధ్యమం లింక్డిన్‌ దాదాపు 716 మందికి ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. అలాగే చైనాలో ప్రత్యేకంగా సేవలు అందిస్తున్న జాబ్‌ అప్లికేషన్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది.
 
లింక్డిన్‌‌లో 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాది ప్రతి త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో వృద్ధి నమోదైంది. అయినప్పటికీ.. ఉద్యోగుల తొలగింపు విషయంలో మాత్రం ఇతర కంపెనీల బాటలోనే నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితే దీనికి కారణంగా తెలుస్తుంది. కార్యకలాపాలను ప్రామాణీకరించడంతో పాటు వేగవంతమైన నిర్ణయాల కోసం వివిధ అంచెలను తగ్గించడం కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉద్యోగులకు లేఖ రాశారు.
 
చైనాలో సవాల్‌తో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 'ఇన్‌కేరీర్స్‌' అనే జాబ్‌ యాప్‌ను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు లింక్డిన్‌ తెలిపింది. 2021లోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు దీన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 9 నాటికి దశలవారీగా యాప్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments