Webdunia - Bharat's app for daily news and videos

Install App

TCS: 12,261 మంది ఉద్యోగుల కోత.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటన

సెల్వి
సోమవారం, 28 జులై 2025 (13:02 IST)
TCS
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఈ సంవత్సరం తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో దాదాపు 2 శాతం లేదా 12,261 మంది ఉద్యోగులను తొలగించనుంది. వీరిలో ఎక్కువ మంది మధ్య, సీనియర్ గ్రేడ్‌లకు చెందినవారు. జూన్ 30, 2025 నాటికి, టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069కి చేరుకుంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది తన ఉద్యోగుల సంఖ్యను 5,000 మంది పెంచుకుంది. 
 
"భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థ"గా మారాలనే కంపెనీ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. టెక్నాలజీలో పెట్టుబడులు, AI విస్తరణ, మార్కెట్ విస్తరణ, శ్రామిక శక్తి పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించినట్లు టీసీఎస్ తెలిపింది.
 
ఇక టీసీఎస్ ప్రభావితమైన ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు, అవుట్‌ప్లేస్‌మెంట్, కౌన్సెలింగ్, మద్దతును అందిస్తుంది. ఈ తొలగింపు ప్రక్రియను తొందరపాటుగా చేపట్టబోమని టీసీఎస్ సీఈవో, ఎండీ కె. కృతివాసన్ స్పష్టం చేశారు. 
 
అయితే, కొంతమంది ఉద్యోగులను రీడెప్లాయ్ చేయడం సాధ్యం కాని సందర్భాల్లో, వారిని సంస్థ నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది. టీసీఎస్ ఈ తొలగింపులకు నిర్దిష్ట సమయపాలనను ప్రకటించలేదు. అయితే ఈ ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరం అంతటా క్రమంగా కొనసాగుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments