Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షం

Advertiesment
Rains

ఠాగూర్

, గురువారం, 24 జులై 2025 (17:09 IST)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడివుందని భారత వాతావరణ శాఖ అమరావతి ప్రాంతీయ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగాై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదలుతూ వెస్ట్ బెంగాల్, దానికి ఆనుకునివున్న ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని వివరించింది.
 
కాగా, ఈ అల్పపీడనంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్‌డేట్ ఇచ్చింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం వర్షపు నీటిలో మునిగిపోతోంది. 

బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించిన ప్రేమోన్మాది... పట్టుకుని చితక్కొట్టారు.. 
 
మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రేమోన్మాది పదో తరగతి బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు చాకచక్యంగా ఆ యువకుడుని పట్టుకుని చితక బాదారు. పట్టపగలు ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సతారలోని ఓ పాఠశాలలో ఓ బాలిక పదో తరగతి విద్యాభ్యాసం చేస్తోంది. అయితే, 18 యేళ్ల మైనర్ యువకుడు ప్రేమ పేరుతో ఆ బాలిక వెంటపడగా, ఆ బాలిక తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు ప్రేమోన్మాదిగా మారిపోయాడు. తనను ప్రేమించాలని వెంటపడుతూ వేధించసాగాడు. అయినప్పటికీ ఆ బాలిక ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు.
 
దీంతో ఆ బాలిక పాఠశాల నుంచి ఇంటికి తిరిగివస్తుండగా, అతను అడ్డుకుని మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి, ఆ బాలికను ఆ యువకుడు నుంచి సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత ఆ యువకుడికి దేహశుద్ది చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?