Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు సంగీత ప్రేమికులా.. అయితే మీకొక శుభవార్త..

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (20:36 IST)
ఇప్పటివరకు ఎన్నో మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా మరో మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. అదే స్పాటిఫై. స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ఉచితమే, అయినప్పటికీ మ్యూజిక్ క్వాలిటీలో కొన్ని పరిమితులు ఉంటాయి. 
 
స్పాటిఫై సభ్యత్వాన్ని తీసుకున్నవారు అన్ని ఫీచర్లు వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి యాడ్స్ ఉండవు. మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం ఒక నెల ప్రీమియం ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత మాత్రం రూ.119 చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ని తీసుకోవాలి. ఇందులో విద్యార్థులకు ఒక వెసులుబాటు కల్పించారు. 
 
విద్యార్థులకు మాత్రం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. తాజాగా భారత్‌లో స్పాటిఫై ఛార్జీలు ఇలా ఉన్నాయి. ఒక రోజుకు రూ. 13 ఉండగా, వారానికి రూ. 39, నెలవారీ సభ్యత్వానికి రూ. 129 మరియు మూడు నెలలకు రూ. 389గా నిర్ణయించారు. ఈ యాప్ విద్యార్థులకు మరింత దగ్గరయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments