ప్రీపెయిడ్ కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్.. హాలిడే హంగామా పేరుతో...

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... తాజాగా తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ ప్యాక్‌గా గుర్తింపు పొందిన రూ.399పై ర

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (10:46 IST)
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... తాజాగా తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ ప్యాక్‌గా గుర్తింపు పొందిన రూ.399పై రూ.50 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
 
మై జియోలోని ఫోన్‌పే ద్వారా రూ.399 ప్యాక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.50 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నేటి నుంచి ఈనెల 15 వరకు మాత్రమే ఆఫర్ అమలులో ఉంటుంది. రూ.399 ప్యాక్‌లో వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటా లభిస్తుంది. 
 
కాగా, రూ.399 రీచార్జ్ ప్యాక్‌పై ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు అందిస్తోంది. దీనికి ప్రస్తుతం ప్రకటించిన క్యాష్ బ్యాక్ అదనం. అంటే రూ.399 విలువైన ప్యాక్ 100 రూపాయల రాయితీతో రూ.299కే లభిస్తుందన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 'ఫోన్‌పే'తో ఒప్పందం కుదుర్చుకున్న జియో 'హాలీడే హంగామా' పేరుతో ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments