జియో నుంచి ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు... 1100జీబీ ఉచిత డేటా
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలోనే ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సంవత్సరమే వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశవ్యాప్తంగా ఆరంభి
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలోనే ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సంవత్సరమే వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశవ్యాప్తంగా ఆరంభించే ప్రణాళికతో వుంది. 30 పట్టణాల్లో పది కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వుంది.
ఇందులో భాగంగా 2016 నుంచి జియో ఫిక్స్‌డ్ లైన్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను పరీక్షిస్తోంది. గత ఏడాది మే నెల నుంచి కొన్ని సర్కిళ్లలో కొంతమంది ఉచితంగా సేవలు అందిస్తూ.. నాణ్యత, వేగం తదితర అంశాలను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ యూజర్లకు ప్రతి నెలా ఉచితంగా 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో అందించే ప్లాన్‌ను తీసుకొచ్చింది.
100జీబీ ఉచిత డేటా పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు 40జీబీ ఉచిత డేటాను టాప్ అప్ రూపంలో 25 సార్లు పొందవచ్చు. తద్వారా మొత్తం 1100జీబీ అందుతుంది. ఇక అహ్మదాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలపై జియో పరీక్షలు కొనసాగుతున్నాయి.