ఆషిమా నార్వల్ ఎవరో తెలుసా? మోడల్, యాక్టరే కాదు.. ఆర్టిస్ట్ కూడా?

ఆషిమా నార్వల్. ఈమె సిడ్నీ మోడల్, నటీమణి కూడా అయిన ఈమె 2015లో మోడలింగ్ రంగంలో కాలుమోపింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఏడాదికే రెండు టైటిల్స్ గెలుచుకుంది. మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలగన్స్, మిస్ ఇండియ

సోమవారం, 7 మే 2018 (12:38 IST)
ఆషిమా నార్వల్. ఈమె సిడ్నీ మోడల్, నటీమణి కూడా అయిన ఈమె 2015లో మోడలింగ్ రంగంలో కాలుమోపింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఏడాదికే రెండు టైటిల్స్ గెలుచుకుంది. మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలగన్స్, మిస్ ఇండియా గ్లోబల్ 2015 అనే రెండు టైటిల్స్ నెగ్గిన ఈమెకు ప్రస్తుతం సినీ అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. ఆషిమాకు మోడలింగ్‌ రంగంలోనే కాకుండా చిత్రలేఖనంపై ఆసక్తి ఎక్కువ. 
 
ఆమె కళ్లు ప్రతి వస్తువును ఓ చిత్రలేఖనంలా చూస్తాయి. ఇందుకు ఆషిమా తొమ్మిదవ ఏటనే క్రియేటివ్ ఆర్ట్ విభాగం కింద తొలి అవార్డును గెలుచుకోవడమే నిదర్శనం. సిడ్నీలో ఆమె గది మొత్తం పెయింటింగ్స్‌తో నిండివుంటుంది. ఆస్ట్రేలియాలో తక్కువ వ్యవధిలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆషిమా.. ఆస్ట్రేలియా సినిమాల్లో నటించే ఆఫర్లను కైవసం చేసుకుంది. దీంతో మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 
 
నటనలో శిక్షణ
ఆషిమా థియేటర్ యాక్టర్. ఇంకా మెథేడ్ యాక్టింగ్ విధానంలో దిట్ట. డ్యాన్సింగ్ చేసే అలవాటున్న ఆమె నృత్యంలో పలు కోణాలను నేర్చుకుంది. 
 
ప్రత్యేక నైపుణ్యాల సంగతికి వస్తే..
ఆషిమాకు కొత్త భాషలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువ. గతంలో భారత్‌లో ఆమె పర్యటించినప్పుడు తెలుగు, తమిళ భాషలను నేర్చుకుందట. ఇతర భాషలను నేర్చుకోవడం నటనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆషిమా గట్టిగా నమ్ముతోంది. 
 
బ్యూటీ గణాంకాలు
ఆషిమా మెరిసిపోయే బ్రౌన్ హెయిర్ కలిగివుంటుంది. అలాగే ఆకట్టుకునే బ్రౌన్ కళ్లను కలిగివుంటుంది. ఇంకా 165 సీఎం ఎత్తును కలిగివుంటుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పరగడుపునే అరటిపండ్లు తింటే ఏమౌవుతుంది?