Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శునకాలు ఓట్లు వేయవు కదా.. మోదీ అబద్ధాల పుట్ట: ప్రకాష్ రాజ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శున

Advertiesment
Gujarat Assembly polls
, సోమవారం, 7 మే 2018 (12:09 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ప్రధానిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. డియర్ ప్రైమ్ మినిస్టర్.. మనుషుల కంటే ముధోల్ శునకాలు బాగా పనిచేస్తాయని.. వాటిని ఆర్మీలో రిక్రూట్ చేసుకునే విషయమై చర్చిస్తానని అన్నారు. కానీ శునకాలు ఓట్లు వేయవు కదా.. ఉద్యోగాల కోసం యువత కలలు కంటోందన్నారు.
 
అలాగే రైతులు కూడా ఆవేదనలో వుండగా.. ఓటు వేయడం ద్వారా మెరుగైన జీవితాన్ని పౌరులు కోరుకుంటున్నారనే విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు. మేము ఏమైనా కుక్కల మాదిరి బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ప్రధాని చెప్పే అసత్యాల సంఖ్య పెరిగిపోతుందని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. కనీసం ప్రధాని చెప్పే అబద్ధాల సంఖ్య గుర్తుందా అంటూ అడిగారు. అలాగే మహదాయి విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ప్రధానమంత్రే ప్రజలు చెవుల్లో పూలుపెట్టే పనిచేస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ దుయ్యబట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక ఎన్నికలు : 883 మంది కోటీశ్వరులు.. 391 మందిపై క్రిమినల్ కేసులు