ఢిల్లీలో టెక్కీ కిడ్నాప్.. సినీ ఫక్కీలో ఎన్‌కౌంటర్... యువకుడు సేఫ్...

ఢిల్లీలో ప్రముఖ టెక్ కంపెనీ హెచ్.సి.ఎల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ కిడ్నాప్ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సినీ ఫక్కీలో కిడ్నాపర్లను ఎన్‌కౌంటర్ చేసి.. ఆ టెక్కీని సు

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (10:36 IST)
ఢిల్లీలో ప్రముఖ టెక్ కంపెనీ హెచ్.సి.ఎల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ కిడ్నాప్ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సినీ ఫక్కీలో కిడ్నాపర్లను ఎన్‌కౌంటర్ చేసి.. ఆ టెక్కీని సురక్షితంగా రక్షించారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్సీఎల్ లో టెక్కీగా పనిచేస్తున్న ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయగా, పోలీసులు ఈ ఉదయం ఆ యువకుడిని రక్షించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే,
 
ఘజియాబాద్‌కు సమీపంలోని నోయిడాలో వున్న హెచ్.సి.ఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా రాజీవ్ అనే యువకుడు పని చేస్తున్నాడు. మే 24న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు, ముందురోజు హరిద్వార్‌కు వెళ్లాడు. ఆ క్రమంలో ఘజియాబాద్ సమీపంలోని రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్ వరకూ వచ్చి అదృశ్యమయ్యాడు. ఆ మరుసటి రోజు కొందరు కిడ్నాపర్లు రాజీవ్ ఇంటికి ఫోన్ చేసి, మీ బిడ్డను అపహరించామని, తిరిగి వదిలిపెట్టాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
కిడ్నాప్ చేసిన టెక్కీని ఇందిరాపురంలో బంధించినట్టు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ గుర్తించింది. ఈ బృందం శుక్రవారం ఉదయం రాజీవ్‌ను దాచి ఉంచిన చోటుకు చేరుకుంది. ఈ బందంలోని పోలీసులను చూడగానే కిడ్నాపర్లు పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు కిడ్నాపర్లు చనిపోగా, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఆ తర్వాత రాజీవ్‌ను సురక్షితంగా పోలీసులు రక్షించారు. ఇదే గ్రూప్ గతంలోనూ యువకులను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిందని పోలీసు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Legendary Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి లేదా కీర్తి సురేష్?

మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా పోలీస్ కంప్లైంట్ టీజర్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

Boyapati: అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా అఖండ 2 తాండవం : బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments