Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ మార్కెట్‌లోకి షావోమీ మిడ్ రేంజ్ కొత్త ట్యాబ్లెట్!!

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (15:02 IST)
భారతీయ మార్కెట్‌లోకి షావోమి మిడ్ రేంజ్ కొత్త ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. రేడ్‌మీ ప్రో 5జీ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2తో లభ్యంకానుంది. స్లైలస్, పెన్‌తో వచ్చిన ఈ ట్యాబ్ మిస్ట్ బ్లూ, క్విక్ సిల్వర్ రంగుల్లో లభ్యంకానుంది. 
 
రెడ్‌మీ ప్యాడ్‌ ప్రో 5జీ 2.5కే రెజల్యూషన్‌తో కూడిన 12.1 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ తెరతో వస్తోంది. ఈ డిస్‌ప్లే 68.7 బిలియన్‌ రంగులు, డాల్బీ విజన్‌, 120Hz రీఫ్రెష్‌ రేటును సపోర్ట్ చేస్తుంది. దీనికి కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌ను ఇచ్చారు. 
 
వీటిని ప్రాథమికంగా ఫొటోగ్రఫీని దృష్టిలో ఉంచుకొని తీర్చిదిద్దలేదు. అందుకే ప్రధాన, సెల్ఫీల కెమెరాలను 8ఎంపీకే పరిమితం చేశారు. 33డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 10,000ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. స్టీరియో స్పీకర్‌ సిస్టమ్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌. వైఫై 6, బ్లూటూత్‌ 5.2 వంటి ఆప్షన్లు ఉన్నాయి. సెల్యూలార్‌ సపోర్ట్‌ కూడా ఉండడం గమనార్హం.
 
రెడ్‌మీ ప్యాడ్‌ ప్రో 5జీ 8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌ 256జీబీ స్టోరేజ్‌.. రెండు వేరియంట్లలో లభిస్తోంది. స్టోరేజ్‌ను 1.5టీబీ వరకు విస్తరించుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ.24,999. షావోమి వెబ్‌సైట్‌తో పాటు ఈకామర్స్‌ వేదికలపై దీన్ని కొనుగోలు చేయొచ్చు. ఆగస్టు 2 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments