Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని లేదు.. జట్టుకు లీడర్‌గా ఉండాలని భావిస్తా : సూర్య కుమార్ యాదవ్

Advertiesment
surya kumar yadav

వరుణ్

, సోమవారం, 29 జులై 2024 (11:48 IST)
శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నారు. శనివారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్బంగా జట్టు క్లిష్ట సమయంలో ఉన్నపుడు చాలా తెలివిగా ఆలోచన చేసి బౌలర్లను ఉపయోగించిన తీరుపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ అంశంపై సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తనను తాను కెప్టెన్‌గాకాకుండా ఒక నాయకుడిగా వర్గీకరించుకుంటానని సూర్య చెప్పాడు. తనకు కెప్టెన్‌గా ఉండాలని లేదని, జట్టుకు ఒక లీడర్‌గా ఉండాలనుకుంటానని వ్యాఖ్యానించాడు. 
 
కీలకసమయంలో యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ను బౌలింగ్‌కు దించడంపై స్పందిస్తూ.. అతడి బౌలింగ్ ప్రత్యేకంగా ఉంటుందని, ఐపీఎఎల్‌తో పాటు నెట్స్‌లో బౌలింగ్ చేయడం తాను స్వయంగా చూశానని సూర్య చెప్పాడు. జట్టుకు రియాన్ అదనపు బలం అని భావించామని చెప్పాడు. ఇక శ్రీలంకలో భారత జట్టుకు ఇంత చక్కటి మద్దతు లభిస్తుండడం తనకు చాలా ఆనందంగా అనిపిస్తోందని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌లు బీసీసీఐ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
 
కాగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ సూర్య కుమార్ యాదవ్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్ అద్భుతంగా రాణించారు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 84/0గా ఉంది. లంక సునాయాసంగా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్టుగా కనిపించింది. ఆ సమయంలో సూర్య కుమార్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు.
 
అప్పటికే ఐదుగురు ప్రధాన బౌలర్లను ఉపయోగించిన సూర్య.. తొమ్మిదో ఓవర్లో వ్యూహాత్మకంగా అర్షదీప్ సింగ్‌ను బౌలింగ్‌కు దించాడు. అతడు కుశాల్ మెండిస్ వికెట్‌ తీశాడు. అయినప్పటికీ లంక దూకుడు ఆగలేదు. దీంతో 15వ ఓవర్లో అక్షర్ పటేల్‌ను సూర్య దించాడు. పిచ్‌పై బంతి టర్న్ అవుతుండడంతో అక్షర్ మ్యాజిక్ చేశాడు. కుశాల్ పెరీరా, క్రీజులో పాతుకుపోయిన నిస్సాంకాను ఔట్ చేశాడు. అంతటితో ఆగని సూర్య యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ను రంగంలోకి దించాడు. అతడు ఏకంగా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సూర్య కెప్టెన్సీ నైపుణ్యాలను భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒలింపిక్స్‌లో సత్తా చాటిన మను బాకర్ - విషెస్ చెప్పిన సీఎం బాబు - డిప్యూటీ సీఎం పవన్