చౌక ధరలో రెడ్ మీ ఫోన్లు... ఆగస్టు 31 నుంచి అమ్మకాలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:28 IST)
Redmi 9
భారత మార్కెట్లోకి చౌక ధరలో రెడ్ మీ ఫోన్లు విడుదలయ్యాయి. రెడ్‌మీ 9 పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి సదరు సంస్థ విడుదల చేసింది. మొత్తం రెండు వేరింయంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 
 
4జీబీ/64జీబీ అంతర్గత మొమరీ వేరియంట్ ధర రూ. 8,999గా, 4జీబీ/128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 9,999గాను సంస్థ నిర్ణయించింది. ఆగస్టు 31 నుంచి ఎంఐ.కామ్‌, అమెజాన్‌లలో రెడ్‌మీ 9 అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కార్బన్‌ బ్లాక్‌, స్కై బ్లూ, స్పోర్టీ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.
 
ఇకపోతే.. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డాట్‌వ్యూ డిస్‌ప్లేను ఇది కలిగివుంటుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్ హీలియో జీ35 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌‌తో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి అమర్చారు. 
 
వెనకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డెప్త్‌ సెన్సార్‌తో 2 ఎంపీ కెమెరా ఉంటాయి. ముందు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని రెడ్ మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments