Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్‌మి నుంచి ల్యాప్‌టాప్.. అమేజాన్ బ్యాక్‌ టూ కాలేజ్ సేల్..

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:13 IST)
Realme Laptop
కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు దేశంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ల్యాప్ టాప్‌లకు మంచి డిమాండ్ వుందని గమనించిన చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
రియల్‌మి బుక్ ల్యాప్‌టాప్‌కు సంబంధించి కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. అయితే ఆగస్టు నెలలో రియల్‌మి బుక్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్‌లో రియల్‌మి బుక్ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ. 40,000 ఉంటుందని తెలుస్తోంది.
 
మరోవైపు నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్‌ ఇండియా 'బ్యాక్‌ టూ కాలేజ్‌' పేరిట సేల్‌ను ప్రారంభించింది.
 
బ్యాక్‌ టూ కాలేజ్‌ సేల్‌ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ల్యాప్‌ టాప్‌లు, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, ఇతర గాడ్జెట్స్‌పై 50 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్‌పై విద్యార్థులకు ఎడ్‌టెక్‌ యాప్స్‌ నుంచి డేటా సైన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి కోర్సులపై ఆఫర్లను పొందవచ్చును. 
amazon
 
ల్యాప్‌టాప్‌ లేదా టాబ్లెట్‌ కొనుగోలు చేస్తే వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్‌ విద్యా వంటి ఎడ్యుకేషన్‌ యాప్‌లోని ఆన్‌లైన్‌ కోర్సులపై సుమారు రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ద్వారా కూడా గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ వీలు కల్పిస్తోంది. హెచ్‌పీ పెవిలియన్ కోర్ i5 11thGen ల్యాప్‌టాప్‌పై రూ. 10,000 తగ్గింపుతో రూ. 66, 940 కు అందించనుంది. ఇతర ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లపై అడిషనల్‌ కూపన్లను అందించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments