చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ టెక్నో భారత మార్కెట్లోకి వరుసగా ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. బడ్జెట్ విభాగంలో అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తాజాగా స్పార్క్ 7 సిరీస్‌లో టెక్నో స్పార్క్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ ఆవిష్కరించింది. ఫోన్ ప్రారంభ ధర రూ.9,999 కాగా, ఆఫర్‌లో భాగంగా 8,990కే కొనుగోలు చేయొచ్చు.
ఇందులో 90Hz డిస్‌ప్లే, 10W చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ80, 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఆల్ప్స్ బ్లూ, స్ర్పూస్ గ్రీన్, మాగ్నెట్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. అమెజాన్‌లో మే 28 నుంచి మొబైళ్ల సేల్ ప్రారంభంకానుంది.