Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్లోకి శాంసంగ్‌ గెలాక్సీ M02s.. ధర రూ.10వేలు లోపే!

Advertiesment
మార్కెట్లోకి శాంసంగ్‌ గెలాక్సీ M02s.. ధర రూ.10వేలు లోపే!
, గురువారం, 7 జనవరి 2021 (20:04 IST)
Samsung Galaxy M02s
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ భారత్‌లో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్‌ గెలాక్సీ M02s పేరుతో విడుదలైన ఫోన్‌ ధర 10వేల లోపేనని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభిస్తామని అమేజాన్‌ పేర్కొంది.

M02s ఫోన్‌ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ లభిస్తుంది. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌.ఇన్‌, శాంసంగ్‌.ఇన్‌తో పాటు దేశంలోని ప్రముఖ రిటైల్‌ దుకాణాల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. 
 
15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. భారత్‌లో గెలాక్సీ ఎం02ఎస్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర 8,999 కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ రూ.9,999గా నిర్ణయించారు.
 
శాంసంగ్‌ గెలాక్సీ M02s స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.50 అంగుళాలు
రియర్‌ కెమెరా: 13+2+2 మెగా పిక్సల్‌
ర్యామ్‌:4జీబీ
స్టోరేజ్‌:64జీబీ
బ్యాటరీ కెపాసిటీ:5000mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10
ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450
ఫ్రంట్‌ కెమెరా: 5 మెగా పిక్సల్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమికి ఏమైంది..? ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందా? ఒక్కసారిగా వేగంగా..?