ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మీ భారత మార్కెట్లలోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మేరకు రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ 9 సిరీస్‌లో 5జీ మోడల్స్ రిలీజ్ చేసిన సదరు సంస్థ తాజాగా రియల్‌మీ 9 సిరీస్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 9 4జీను తీసుకువచ్చింది.
హైఎండ్ స్పెసిఫికేషన్లతో స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకు అందించేందుకుగాను రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది రియల్‌మీ. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రానుంది. రియల్‌మీ 9 4జీ (6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.17,999 కాగా, రియల్‌మీ 9 4జీ (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.18,999 గా ఉంది.