Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినియోగదారులందరి కోసం స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన కూ

Koo
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (21:04 IST)
వాలంటరీ స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా కూ యాప్ అవతరించింది. ఇప్పుడు ఏ యూజర్ అయినా ప్రభుత్వం ఆమోదించిన తమ ఐడి కార్డ్ ఉపయోగించి ప్లాట్‌ఫారమ్‌లో వారి ప్రొఫైల్‌ను సెకన్లలో స్వీయ-ధృవీకరణ చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు ప్లాట్‌ఫారమ్‌లో వారి అకౌంట్ యొక్క ప్రామాణికతను నిరూపించడానికి అధికారం ఇస్తుంది. దీనివల్ల వారు పంచుకునే ఆలోచనలు మరియు అభిప్రాయాలకు విశ్వసనీయత మరింత పెరుగుతుంది. స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణ నిజమైన స్వరాల దృశ్యమానతను పెంచుతుంది.

 
అకౌంట్ స్వీయ-ధృవీకరించబడినట్లు ఆకుపచ్చ టిక్ రూపంలో కనిపించే మార్కర్ గుర్తిస్తుంది. రూల్ 4(7) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసిన మొదటి ‘ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి’ కూ. యూజర్లు తమ ప్రభుత్వ ఐడి నంబర్‌ను నమోదు చేసి, ఓటిపిని నమోదు చేసి, విజయవంతమైన ప్రామాణీకరణ తర్వాత, వారి ప్రొఫైల్‌లో ఆకుపచ్చ టిక్‌తో స్వీయ-ధృవీకరణ పొందుతారు. మొత్తం ప్రక్రియ కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ప్రభుత్వ అధీకృత థర్డ్-పార్టీల ద్వారా ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎటువంటి సమాచారాన్నీ కూ సేకరించదు.

 
వాలంటరీ స్వీయ-ధృవీకరణ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్లను శక్తివంతం చేయడంతో పాటు - ప్రామాణికతను ప్రోత్సహించడం ద్వారా - ఆన్‌లైన్ తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రసంగం, దుర్వినియోగం మరియు బెదిరింపులను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది

 
కూ సహ వ్యవస్థాపకుడు, సీఈఒ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో విశ్వాసం మరియు భద్రతను ప్రోత్సహించడంలో కూ ముందంజలో ఉంది. ప్రపంచంలోనే వాలంటరీ స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయినందుకు మేము చాలా గర్విస్తున్నాము. మా సురక్షితమైన మరియు భద్రమైన ధృవీకరణ ప్రక్రియ ద్వారా యూజర్లు సెకన్లలో స్వీయ-ధృవీకరణను పొందవచ్చు. యూజర్లకు మరింత ప్రామాణికతను అందించడానికి మరియు ప్లాట్‌ఫారమ్‌లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి ఇది ఒక పెద్ద అడుగు. చాలా సామాజిక మాధ్యమాలు కొన్ని అకౌంట్లకు మాత్రమే ఈ అధికారాన్ని ఇస్తాయి. కూ ఇప్పుడు ప్రతి యూజర్‌కు ఒకే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉండేలా అవకాశాన్ని కల్పించిన మొదటి ప్లాట్‌ఫారమ్.” అని అన్నారు.

 
స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణ తరచుగా అడిగే ప్రశ్నలు:
 
1. యూజర్ యొక్క వివరాలు ఏవైనా కూ సేకరిస్తుందా?
లేదు. యూజర్లకు సంబంధించిన ఎటువంటి వివరాలనూ కూ సేకరించదు. వివరాలను ప్రామాణీకరించడానికి ప్రభుత్వ అధీకృత థర్డ్ పార్టీ సర్వీస్ ఉపయోగించబడుతుంది.

 
2. ధృవీకరణ తర్వాత నా ఐడి కార్డు వివరాలు కూలో కనిపిస్తాయా?
లేదు. ఇది యూజర్ యొక్క విశ్వసనీయతను నిర్ధారించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది.

 
3. ఇతర యూజర్లు నా పేరు మరియు ఐడి కార్డు సమాచారాన్ని యాక్సెస్ చేయగలరా?
లేదు. యూజర్ ప్రొఫైల్‌లోని వివరాలు ధృవీకరణకు ముందు ముందు ఉన్నట్లే ఉంటాయి.
 
 
4. ప్రభుత్వం ఆమోదించిన నా ఐడి కార్డ్ వివరాలను కూలో నమోదు చేయడం సురక్షితమేనా?
అవును. కూలో వాలంటరీ స్వీయ ధృవీకరణ ప్రక్రియ సురక్షితమైనది మరియు భద్రమైనది. ప్రభుత్వ అధీకృత థర్డ్-పార్టీ ద్వారా ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. యూజర్ డేటాను కూ సేకరించదు.

 
5. యూజర్ దీన్ని ఎందుకు చేయాలి?
అతని/ఆమె ప్రొఫైల్‌ను ధృవీకరించే యూజర్ ప్రామాణికమైన యూజర్‌గా గుర్తించబడతారు, ఇది వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలకు మరింత విశ్వసనీయతను ఇస్తుంది. ప్లాట్‌ఫారమ్‌లో నిజమైన స్వరాలను వాలంటరీ స్వీయ-ధృవీకరణ ప్రోత్సహిస్తుంది. ఇది ఇతర సోషల్ మీడియాలో కొన్ని ప్రముఖ అకౌంట్లకు మాత్రమే అందుబాటులో ఉండే ధృవీకరణ అధికారాన్ని కూడా వారికి అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా? ఏపీలో క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు తప్పవా?