ఒకప్పుడు బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, స్వంచ్చంధ సంస్థలు ప్రత్యేక షోలు వుండేవి. అందుకు టిక్కెట్లను వేలల్లో అమ్మేవారు. అది పోయింది. కానీ మరో రూపంలో అది వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్. సినిమాకు అది దక్కింది. తెలంగాణలో టికెట్ల రేట్లను పెంచుకోవచ్చని ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, మూసా పేట థియేటర్లలో షోకు టికెట్ ఐదు వేలుగా నిర్ణయించారట. ఇది ఎవరో చేసింది కాదు. ఆర్.ఆర్.ఆర్. సినిమా పంపిణీదారుడు దిల్ రాజు నిర్ణయించాడు.
ఈనెల 25న సినిమా విడుదలకావడంతో ఆరోజు ప్రదర్శించే ఆరు షోలకు ఇదే రేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇందుకు అన్నీ ఖర్చులు పోను టికెట్ రేట్ 5వేలు ఫిక్స్ చేసినట్లు దిల్‌రాజు వర్గాలు తెలియజేస్తున్నాయి. దాదాపు ఐదు షోలు పడినా రెండుకోట్లకుపైగా వసూలు అవుతుంది. ఇద్దరు హీరోలు, రాజమౌళి క్రేజ్‌ను ఆయన ఎలా కేష్ చేసుకుంటున్నాడో తెలిసి ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే దీన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీర ఇంత దోపిడీ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అయితే బెనిఫిట్ షోలకు తారాగణం రాబోతుందని ప్రచారం కొత్తగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.