Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌టాక్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్.. బిగోను బ్యాన్ చేసేసింది..!

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (16:23 IST)
పాకిస్థాన్ టిక్‌టాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పబ్జీ వీడియో గేమ్‌ను నిషేధించిన పాకిస్థాన్.. ప్రస్తుతం టిక్‌టాక్‌పై పడింది. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందనే కారణంతో పబ్జీని నిషేధించిన పాకిస్థాన్‌.. టిక్‌టాక్‌పై కూడా అదే అభియోగాన్ని మోపుతోంది. టిక్‌టాక్‌లో అసభ్యత, అశ్లీలత హద్దులు దాటకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డైన్స్‌‌ను ఆదేశించింది. 
 
పబ్జీ, టిక్‌టాక్‌లే కాకుండా సోషల్‌ మీడియాలోని పలు యాప్‌లలో అసభ్యకరంగా కంటెంట్‌ ఉంటుందని ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని పాకిస్థాన్‌ టెలి కమ్యూనికేషన్స్‌ అథారిటీ చెప్తోంది. టిక్ టాక్‌లో అలాగే బిగోలోనే అడల్ట్ కంటెంట్ అధికంగా వుంటుందని పాకిస్థాన్ టెలి కమ్యూనికేషన్స్ అథారిటీ తెలిపింది. ఈ కారణంగా యువత చెడుదారిన పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది. 
 
ఇప్పటికే ఈ విషయమై ఆయా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేశామని పేర్కొంది. ఇప్పటికే బిగోను నిషేధించామని, టిక్‌టాక్‌కు ఆఖరి హెచ్చరిక జారీ చేశామని, టిక్‌టాక్‌లో మితిమీరుతున్న అశ్లీలతను, అసభ్యతను, అనైతిక వీడియోలను నియత్రించేందుకు సమగ్రమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించామని పాక్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ అథారిటీ చెబుతోంది. దీంతో బిగోను బ్యాన్ చేసిన పాకిస్థాన్.. టిక్ టాక్‌కు మాత్రం ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments