బ్రిటన్.. డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. 5జీ నెట్‌వర్క్‌లో చైనా కంపెనీ హువాయికి పరిమిత పాత్ర ఇవ్వాలనే నిర్ణయంలో బ్రిటన్ వెనక్కి తీసుకుంది. చైనా కంపెనీ హువాయి నుంచి వచ్చే ఏడాది ఆరంభంలో 5జీ పరికరాలను కొనుగోలు చేయరాదని టెలికాం ప్రొవైడర్లను బ్రిటన్ ఆదేశించింది. ఇప్పటికే చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన తరుణంలో బ్రిటన్ కూడా చైనాకు షాకిచ్చింది.
దేశ 5జీ నెట్‌వర్క్ ప్రక్రియ నుంచి హువాయిని తొలగించాలని కోరుతూ పదిమంది కన‍్జర్వేటివ్ ఎంపీలు బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. మరోవైపు 5జీ ప్రక్రియలో తమపై బ్రిటన్ నిషేధం విధించడం నిరాశపరిచిందని, ఇది రాజకీయ నిర్ణయమని హువాయి వ్యాఖ్యానించింది.
అయితే హువాయి పరికరాల ద్వారా చైనా ప్రభుత్వం బ్రిటన్ నెట్‌వర్క్‌ల్లోకి చొరబడుతుందనే ఆందోళనతో ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని అమెరికా హెచ్చరించిన క్రమంలో 5జీ నెట్‌వర్క్ నుంచి హువాయిని బ్రిటన్ నిషేధించింది.