Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేస్తే శాస్త్రవేత్తలే షాకయ్యారు.. ఎందుకో తెలుసా?

పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేస్తే శాస్త్రవేత్తలే షాకయ్యారు.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 13 జులై 2020 (20:03 IST)
నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్‌ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేసిన అధికారులు షాకయ్యారు. ఇంతకీ బుద్ధ విగ్రహాన్ని చూసి ఎందుకు షాకయ్యారా? అని అనుకుంటున్నారు కదూ. విషయం వుంది. ఆ బుద్ధ విగ్రహంలో ఒక మనిషి అస్థి పంజరం వుంది. పురాతన బుద్ధుని విగ్రహంలో మనిషి అస్థిపంజరం అందులోకి రావడం ఏంటని బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. 
 
అయితే చివరికి తేలిందేమిటంటే? ఆ విగ్రహం దాదాపు వెయ్యి ఏళ్ల నాటిదని 11వ శతాబ్దం లేదా 12 శతాబ్దానికి చెందినది అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విగ్రహం మమ్మీ మాదిరిగా దాని చుట్టూ వస్త్రం కప్పి ఉండటమే కాకుండా చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. అది చైనాకు చెందిన లిక్వాన్ అనే బౌద్ద సన్యాసిదని గుర్తించారట.. ప్రస్తుతం ఆ విగ్రహంపై పలు రకాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.  


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబర్ మూడో వారానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా