Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ‘రెనో’ ఫీచర్లు ఇవే..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (19:05 IST)
చైనీస్ హ్యాండ్‌సెట్ బ్రాండ్ ఒప్పో నుంచి మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెనో వచ్చేసింది. రెనో సిరీస్‌లో భాగంగా రెండు వేరియంట్‌లను తీసుకొచ్చింది. ఒప్పొ రెనో 10ఎక్స్ జూమ్, ఒప్పో రెనోలను విడుదల చేసింది. ఈ మేరకు ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్ 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో రూ.39,990 కాగా, 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 49,990గా నిర్ణయించబడింది. 
 
ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ చేస్తూండగా... ఒప్పో రెనో 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,990. ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ ఎడిషన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా జూన్ 7వ తేదీ నుంచి అందుబాటులో రానుండగా, ఒప్పో రెనో రిటైల్ స్టోర్లు, అమెజాన్ ద్వారా అదే రోజు నుంచి అందుబాటులోకి రానుంది.
 
ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి: 
6.6 అంగుళాల పనోర్యామిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ఎస్‌ఓసీ, 
6జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లు, 
48+13+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 
బ్యాటరీ 4,065 ఎంఏహెచ్ 
 
కాగా... ఒప్పో రెనో స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి: 
6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ పనోర్యామిక్ అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ఎస్ఓసీ, 
8 జీబీ ర్యామ్, 
48+5 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా,16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 
బ్యాటరీ 3,765 ఎంఏహెచ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments