OnePlus Nord 3ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా వున్నారా.. అయితే ఇది గుడ్ టైమ్ అని చెప్పవచ్చు. అమేజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్ OnePlus Nord 3పై భారీ డిస్కౌంట్ ధరకు అందిస్తుంది. ప్రస్తుతం రూ.20వేలకే ఈ ఫోన్ అమేజాన్‌లో లభిస్తుంది.
OnePlus Nord 4 విడుదల కాబోతున్న సమయంలోనే ఈ డీల్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు బాగా కలిసొచ్చింది. OnePlus Nord 3 అమెజాన్‌లో రూ.19,998 వద్ద అందుబాటులోకి వుంటుంది. ప్రత్యేక కార్డ్ ఆఫర్‌లు అవసరం లేదు.
అయితే, కొన్ని క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల ధర మరింత తగ్గుతుంది. ఈ క్రమంలో Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, కస్టమర్‌లు దాదాపు వెయ్యి రూపాయల వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీంతో ధర రూ.18,998కి తగ్గుతుంది.
OnePlus Nord 3: స్పెసిఫికేషన్‌లు
OnePlus Nord 3 అనేది MediaTek Dimensity 9000 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది.
ఇది గరిష్టంగా 16GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో వస్తుంది.