Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23-06-202 ఆదివారం దినఫలాలు - కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది...

Astrology

రామన్

, ఆదివారం, 23 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ|| పాఢ్యమి తె.5.46 విదియ తె.4.30 పూర్వాషాఢ రా.6.22 ఉ.శే.వ. 5.42కు రా.వ.2.10 ల 3.44. సా.దు. 4. 43 ల5.35.
 
మేషం :- రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- విందులు, వినోదాలలో అతిగా వ్యవహరించటం వల్ల భంగపాటుకు గురికాకతప్పదు. వివాహయత్నాల్లో సఫలీకృతులవుతారు. ధనం అధికంగా వెచ్చిస్తారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు.
 
మిథునం :- స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. విదేశాయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు.
 
కర్కాటకం :- నిరుద్యోగులకు తాత్కాలికంగా అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. లీజు, ఏజెన్సీలు, భాగస్వామిక ఒప్పందాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు.
 
సింహం :- పత్రికా రంగం సిబ్బంది పొరపాట్లు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, విందుభోజనం వంటి శుభపరిణామాలు ఉంటాయి.
 
కన్య :- వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులుంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
తుల :- స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం :- ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చు కోవలసివస్తుంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
ధనస్సు :- వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించి అనుభవం గడిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ రాబడికి మించటం వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది.
 
మకరం :- సంఘంలో మీ మాటకు గౌరవం, ఆమోదం లభిస్తాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. గత కొంతకాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.
 
కుంభం :- స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రుణం ఏ కొంతైనాతీర్చుతారు. గృహంలో ఒక శుభకార్యం అనుకూలిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు.
 
మీనం :- ఆదాయానికి మించి ఖర్చులు అధికం. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఏకాగ్రతముఖ్యం. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ప్రయత్న పూర్వకంగా సదావకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-06 -2024 నుంచి 29-06-2024 వరకు మీ వార ఫలితాలు