Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23-06 -2024 నుంచి 29-06-2024 వరకు మీ వార ఫలితాలు

weekly astrology

రామన్

, శనివారం, 22 జూన్ 2024 (20:12 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
యోగదాయకమైన కాలం నడుస్తోంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సన్నిహితులు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. శుక్రవారం నాడు చెల్లింపులు తగవు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. ఉన్నతాధికారులకు కష్టసమయం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సోమ, మంగళవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. సంతానానికి శుభయోగం. కుంటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ఉన్నతాధికారులకు హోదామార్పు, ఉపాధ్యాయులకు స్థానచలనం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. మీ కష్టం ఫలించే రోజు త్వరలోనే ఉంది. మీ శ్రీమతి సలహాను తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆసక్తితకరమైన విషయాలు తెలుసుకుంటారు. బుధవారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. ఇంటి విషయాలు పట్టించుకోండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వివాదాలకు దిగవద్దు. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కష్టసమయం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలు కలిసిరావు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆశాజనకం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభవార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పొదుపునకు అవకాశం లేదు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. మీ సామర్ధ్యంపై నమ్మకం కుదురుతుంది. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. వ్యాపకాలు, పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేసే అవకాశం లేదు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆప్తులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉన్నత విద్య, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూలతలు అంతంత మాత్రమే. మీ కృషి వేరొకరికి కలిసివస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. పట్టుదలతో శ్రమించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు హోదా మార్పు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కష్టసమయం. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలతలున్నాయి. బాధ్యతను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గృహంలో సందడి నెలకొంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన పదువులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచిదే. వివాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు పురస్కారయోగం. విందులు, వేడుకలకు హాజరవుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఆత్మస్థైర్యంతో యత్నిస్తే విజయం తధ్యం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్ళు తప్పవు. తలపెట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభం జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఓర్పు, కృషి ప్రధానం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. పొగిడేవారితో జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. మీ సలహా ఉభయులూ పాటిస్తారు. గురువారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారజయం, సంకల్పసిద్ధి ఉన్నాయి. ప్రముఖులకు మరింత చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. శనివారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం.. నువ్వులనూనె, నల్లబెల్లం, నల్లగొడుగులను..?