ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి.
ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది.
ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఎర్రటి అరటిపండ్లలోని లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.