Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18-06-2024 మంగళవారం దినఫలాలు - ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి....

astrolgy

రామన్

, మంగళవారం, 18 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ ద్వాదశి పూర్తి స్వాతి ప.2.41 రా.వ.8.41 ల 10.24. ఉ.దు. 8.03 ల 8.55, రా. దు. 10.51 ల 11.35.
 
మేషం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థిక పరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు.
 
వృషభం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కిరాగలవు. మీ జీవితభాగస్వామి ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. ఒక చిన్న విహార యాత్రను చేస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
మిథునం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలకు బంధువర్గాలు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు, అధికారుల ఒత్తిడి అధికం.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు కలిసిరాగలదు. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒకానొక విషయంలోమీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానమార్పిడికై చేయుయత్నాలు వాయిదా పడతాయి.
 
సింహం :- రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. విద్యార్థులకు దూర ప్రాంతాల నుండి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. తొందరపాటుతనం వల్ల ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు.
 
కన్య :- ఆర్థికంగా మెరుగుపడతారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
తుల :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాలవారికి సామాన్యం. ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం :- తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవటం మంచిదికాదు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడతారు. ఇతరుకు పెద్ద ఎత్తున ధనసహాయం చేసే విషయంలో పునరాలోచనఅవసరం.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అన్నివిధాలా కలిసిరాగలదు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి. భూములు, స్థలాలు కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలు బంధువుల రాకతో అనుకున్న పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో మంచి ఫలితాలుంటాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
కుంభం :- రావలసిన బకాయిలు ముందు వెనుకలుగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. బంధువులు మీ నుంచి ధనం లేక ఇతరత్రాసహాయం అర్థిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. క్రయ విక్రయాలు ఆశించినంత సంతృప్తినీయజాలవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులుతప్పవు.
 
మీనం :- ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-06-2024 సోమవారం దినఫలాలు - యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది...