Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-06-202 శనివారం దినఫలాలు - సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు...

astrolgy

రామన్

, శనివారం, 15 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ నవమి రా.12.52 ఉత్తర ఉ.7.33 సా.వ.4.51 ల 6.38. ఉ.దు. 5.28 ల 7.11.
 
మేషం :- ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వ్యాపారాలు, గృహంలో సందడి కానవస్తుంది. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. రుణం కొంత మొత్తం తీర్చటంతో కుదుటపడతారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం :- నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు ఆశాజనకం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళుకువ వహించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి శ్రమాధిక్యత. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది.
 
మిథునం :- ఆర్థిక కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు తాత్కాలిక ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉండగలదు. ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
 
కర్కాటకం :- ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. క్రయ విక్రయాలు సామాన్యం. శ్రమకోర్చి పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటుంగ్‌లు అందుకుంటారు. ఆలయా సందర్శినాల్లో ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మిత్రుల వ్యాఖ్యల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది.
 
సింహం :- వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఒప్పందాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం. హోటల్, స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. అనుకోకుండా కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోవటంమంచిది.
 
కన్య :- స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
తుల :- భార్యా, భర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.
 
వృశ్చికం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. బ్యాంకు వ్యవహరాల్లో మెళకువ వహించండి. వాహనం కొనుగోలుకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా పడటం మంచిది. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అథ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. పెద్దలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసివస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు.
 
కుంభం :- పెంపుడు జంతువుల పట్ల శ్రద్ధ చూపుతారు. చిన్నతరహా, చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. అప్రయత్నంగా కొన్ని వ్యవహరాలు అనుకూలిస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వార్తా సంస్థలలోని వారికి మందకొడిగా ఉంటుంది. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి సత్కాలం. బంధుమిత్రులకు మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-06-202 శుక్రవారం దినఫలాలు - ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి...