Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

Astrology

రామన్

, మంగళవారం, 11 జూన్ 2024 (05:00 IST)
12-06-2024 - బుధవారం. శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ షష్ఠి రా.7.12 మఘ రా.2.32 ప.వ.1.28 ల 3.12.
ప.దు. 11.31 ల 12.23.
 
Astrology
మేషం:- ఆర్ధిక వ్యవహారాలలో పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం.ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్థిరాస్తిని అమ్మటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. పత్రికా సంస్థలోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. 
 
వృషభం:- రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. బంధువుల రాక వల్ల పనులు వాయిదాపడతాయి. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్థులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి.
 
మిధునం: ఉమ్మడి వ్యాపారాలపట్ల ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. బంధుమిత్రులలో కోప తాపాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టటం మంచిది కాదని గ్రహించండి.
 
కర్కాటకం:- ఆర్ధిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. బంధుత్వాని కంటే వ్యవహారానికే ప్రాధాన్యం మివ్వండి. గతం కంటె పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు. 
 
సింహం:- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం. బ్యాంకు వ్యవహరాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. దైవదర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైనకాలం.
 
కన్య:- నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళుకవ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
తుల:- ఆర్ధిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. చేతివృత్తులు, కాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. బంధుమిత్రుల నుంచి అపనిందలను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం:- విదేశాలకు వెళ్ళటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి.
 
 
ధనస్సు:- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
మకరం:– కోళ్ళ, మత్స్య రంగాల్లో వారికి చికాకులు తప్పవు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సునువ్యాకుల పరుస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పని భారం బాగా పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం:- కలప, ఐరన్, వ్యాపారులకు కలిసి వచ్చేకాలం. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది.
 
మీనం:- పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ముఖ్యులకోసం ధనం బాగా వెచ్చించ వలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో కొంత అ సౌకర్యానికి గురవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-06-2024 సోమవారం దినఫలాలు - పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం...