Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-06-2024 శుక్రవారం దినఫలాలు - ధనం అందటంతో పొదుపు చేస్తారు...

Advertiesment
astro2

రామన్

, శుక్రవారం, 7 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ పాఢ్యమి సా.4.58 మృగశిర రా.8.24 తె.వ.4.54 ల ఉ.దు. 8.04 ల 8.56 ప. దు. 12.24 ల 1.16.
 
మేషం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కుటుంబీకులతో కలసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. 
 
వృషభం :- దైవ దర్శనాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కొబ్బరి, పండ్ల, పూల, చల్లని పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మిథునం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
కర్కాటకం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనల్లో చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
సింహం :- హోటల్, నిరుద్యోగులు, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలు కొనుట మంచిది. మీ సంతానం అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు లభిస్తుంది. బంధు మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో చికాకులు అధికమవుతాయి. చిన్నతరహా వృత్తులలోవారికి కలిసిరాగలదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రచన, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సంతానం విదేశీ చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
తుల :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి పురోగతిన సాగుతాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం.
 
వృశ్చికం :- ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్తపడండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి యత్నించండి. ఏసీ కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
 
ధనస్సు :- దంపతుల మధ్య అన్యోన్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. మీపై కొంతమంది అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. కీలకమైన వ్యవహారాల్లో సరియైన నిర్ణయాలు తీసుకుంటారు. కానవచ్చును. సంఘంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. క్రయ విక్రయాలు లాభాసటిగా సాగుతాయి.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారి, చిరు వ్యాపారులకు అనుకూలం. కొంతమంది మీ నుండి ధనసహాయం అర్ధిస్తారు.
 
మీనం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచన లుంటాయి. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-06-2024 గురువారం దినఫలాలు - రాజకీయాల్లోని వారికి విరోధుల వల్ల ఒత్తిడి...