Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13-06-24 గురువారం దినఫలాలు - ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు...

saibaba

రామన్

, గురువారం, 13 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ సప్తమి రా.8.56 పుబ్బ తె.4.57 ఉ.వ.11.21 ల 01.07. ఉ.దు. 9. 48 ల 10.40 ప.దు. 3.00 ల 3.52.
 
మేషం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రముఖులతో పరిచయాలు అనుకోని విధంగా జరుగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో చికాకులను ఎదుర్కొంటారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. 
 
వృషభం :- కుటుంబీకుల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. బంధువుల ఇంట శుభసందర్భాల్లో కీలకపాత్ర వహిస్తారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి.
 
మిథునం :- రచయితలకు, పత్రికా రంగాల వారికి అనుకూలమైన కాలం. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు.
 
కర్కాటకం :- ఒక పుణ్యక్షేత్ర సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది.
 
సింహం :- రసాయనిక, మందులు, ఎరువులు, సుగంధద్రవ్య వ్యాపారస్తులకు కలిసివస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కన్య :- ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. హోటల్ తిరుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణం చేయవలసివస్తుంది. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది.
 
తుల :- ఆర్ధిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులకు చేసే పనియందు ధ్యాస వహించటం మంచిది. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందు లెదుర్కుంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
వృశ్చికం :- అనుకున్న మొత్తం చేతికందుతుంది. వైద్యులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తాయి. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుండి గుర్తింపు లభిస్తాయి. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం మంచిది.
 
ధనస్సు :- వైద్యులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తాయి. ప్రేమికుల మధ్య అపార్ధాలను తొలగిపోతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. నిరుద్యోగులు ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడతారు. 
 
మకరం :- బంధువులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి.
 
కుంభం :- ఊహించని ఖర్చులు అధికం. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
 
మీనం :- బ్యాంక్ పనులు మందకొడిగా సాగుతాయి. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్లకు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రియతముల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?