Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

11-06-2024 - మంగళవారం- పంచమి రోజున వారాహిని పూజిస్తే శుభం

Varahi

రామన్

, మంగళవారం, 11 జూన్ 2024 (08:58 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ పంచమి సా.4.58 ఆశ్రేష రా.12.24 ప.వ.12.24 ల 2.06. ఉ.దు. 8.03 ల 8.55, రా.దు. 10.51 ల 11.35.
 
మేషం:- పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ పనులు, వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం:- శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధచూపిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పొగడ్తలకు పొంగిపోవద్దు.
 
 
మిధునం:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. దంపతుల మనస్పర్థలు తలెత్తుతాయి. పెద్దమొత్తంధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవటం ఉత్తమం. 
 
కర్కాటకం: – ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. కోర్టు వ్యవహరాలు కొత్తమలుపు తిరుగుతాయి. వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం.
 
సింహం:- కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది.
 
కన్య:- టి.వి.రేడియో రంగాలవారికి అనుకూలం. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. కిరణా, ఫ్యాన్పీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సమస్యలకు చక్కని పరిష్కారమార్గం లభించును. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక యిబ్బందిఅంటూ ఏమీ ఉండదు.
 
తుల:- ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. ఆకస్మికప్రయాణాలు చేస్తారు. ఉమ్మడి నిధుల నిర్వహణ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృశ్చికం:- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లోను, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి.
 
ధనస్సు:- ఆర్ధికంగాను, మానసికంగాను కుదుటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం.
 
మకరం:- ఆర్థిక వ్యవహారాల్లో మొహమ్మాటం కూడదు. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. క్రయ విక్రయాలు సామాన్యం. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కుంభం:- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. చేతి వృత్తులు, వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అదనపు సంపాదన కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
మీనం:- కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-06-2024 సోమవారం దినఫలాలు - పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం...