Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16-06-202 ఆదివారం దినఫలాలు - సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు...

horoscope

రామన్

, ఆదివారం, 16 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ దశమి రా.2.44 హస్త ఉ.10.09 సా.వ.6.58 ల 8.43. సా.దు. 4.43 ల 5.35.
 
మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల సలహా పాటించడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసివస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి.
 
వృషభం :- ఫైనాన్సు రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు తమ ప్రతిభను మెరుగు పరుచుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం :- బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. మిత్రులను కలుసుకుంటారు. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. స్త్రీలకు పుట్టింటి నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడుజాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. కొత్త కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఒకానొక వ్యవహరంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగామారి సహాయం అందిస్తారు.
 
సింహం :- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేక పోతారు.
 
కన్య :- స్త్రీలకు షాపింగ్లోనూ, చెల్లింపులలోను అప్రమత్తత చాలా అవసరం. ప్రతి విషయంలోను ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం. చిన్నారులకు విలువైన బహుమతులు అందజేస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- రాజకీయ కళా రంగాల వారికి విదేశీపర్యటనలు అనుకూలం. మీ మనస్సుకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఖర్చులు అధికంగా వెచ్చిస్తారు.
 
వృశ్చికం :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సభా సమావేశాలలో పాల్గొంటారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యవహారలాభం, అనుకోకుండా కొన్ని అవకాశాలు కలిసిరావటం వంటి మంచి ఫలితా లుంటాయి.
 
ధనస్సు :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు దైవ, పుణ్య కార్యాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
మకరం :- స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ కుటుంబీకులపట్ల మమకారం అధికమ వుతుంది. నిరుద్యోగుల ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీఆలోచన లుంటాయి. దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
 
కుంభం :- తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కోసారి మాటపడవలసివస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మీనం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యత్నాలకు బంధువులు సహకరిస్తారు. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తుల మీద మక్కువ పెరుగుతుంది. ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్తవహించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యద్భావం తద్భవతి, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఫలితమే వస్తుంది: డిప్యూటీ సీఎం పవన్ (video)