Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

19-06-202 బుధవారం దినఫలాలు - విదేశాలకు వెళ్ళే యత్నాలు వాయిదాపడతాయి...

Advertiesment
Astrology

రామన్

, బుధవారం, 19 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ ద్వాదశి ఉ.5.43 విశాఖ సా. 4.23 రా.వ.8.35 ల 10.16. ప.దు. 11.31 ల 12.23.
 
మేషం :- వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఏ యత్నం కలిసిరాకపోవటంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం వీలైనంత నిదానంగా నడపటం క్షేమదాయకం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
 
వృషభం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది. సభలు, సమావేశాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాబడి పెంచుకునే విధంగా యత్నాలు సాగిస్తారు. ప్రేమికులకు పెద్దల ఆమోదం, సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తాయి. ఒకానొక సందర్భంలో సోదరుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది.
 
మిథునం :- సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం నుంచి ఆశించిన స్పందన ఉండదు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలు ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీలకు పనిభారం అధికం. దూరపు బంధువుల నుంచి కావలసిన సమాచారం అందుకుంటారు. కొంతమంది మీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తారు. కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
సింహం :- కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. అయిన వారితో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీల అవసరాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. వ్యాపారాల్లో నష్టాలు తొలగి గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విదేశాలకు వెళ్ళే యత్నాలు వాయిదాపడతాయి.
 
కన్య :- ఒక కార్యం సఫలం కావటంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మొండి బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కాంట్రాక్టుల విషయంలో అనుభవజ్ఞుల సలహా పాటించటం మంచిది.
 
తుల :- బ్యాంకు వ్యవహారాలో జాగ్రత్త అవసరం. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. వాహనం నిదానంగా నడపటం మంచిది. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం కోసం ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోక తప్పదు. ఉద్యోగస్థులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. సభా సమావేశాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- ఏదైనా అమ్మటానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలకు పనిభారం అధికంఅవడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. హోటల్, తినుబండారాలు, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. పాడిపశువులు, పెంపుడు జంతువుల విషయంలో ఆందోళన చెందుతారు.
 
మకరం :- వస్త్ర, కళంకారీ, పీచు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసివచ్చే కాలం. బంధు, మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు.
 
కుంభం :- పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రావలసిన మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. దంతాలు, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకు లెదుర్కుంటారు. ఉపాధ్యాయులకు బదలీ ఉత్తర్వులు చేతికందుతాయి.
 
మీనం :- నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక యిబ్బంది అంటూ ఏమీ ఉండదు. వృత్తిరీత్యా కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు. వైద్య రంగంలోని వారికి గుర్తింపు, రాజకీయ రంగాల్లో వారికి ఆందోళన అధికం కాగలదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24న సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల